గోపాల్‌పేట: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందేవిధంగా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మండల అధికారులను ఆదేశించారు. మంగళవారం రేవల్లితో పాటు మండలంలోని తల్పునూరులో పర్యటించి పింఛన్ దరఖాస్తుదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి వివరాలను పరిశీలించారు. అనంతరం రేవల్లి సీహెచ్‌సీని తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడి ఓపీ, ఇన్‌పేషెంట్, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఫార్మసీ, ల్యాబ్‌లను పరిశీలించారు. డెంగీ కేసులు నమోదైతే తగిన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ కీర్తన, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు ఉన్నారు.


