విజయమే లక్ష్యంగా పనిచేయాలి : బీజేపీ | - | Sakshi
Sakshi News home page

విజయమే లక్ష్యంగా పనిచేయాలి : బీజేపీ

Oct 7 2026 2:22 AM | Updated on Oct 7 2026 2:22 AM

వనపర్తి రూరల్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు మెంటేపల్లి పురుషోత్తంరెడ్డి కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సందా వెంకటేష్‌ అధ్యక్షతన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి పెద్ది రాజు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత ఓటర్లతో పాటు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి నవంబర్‌ 6 వరకు అవకాశం ఉందని.. అర్హులందరూ సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి రంగస్వామిగౌడ్‌, మండల ఉపాధ్యక్షుడు రామకృష్ణ నాయక్‌, మెంటేపల్లి తిరుమల్లేష్‌, సంపత్‌కుమార్‌, వెంకటేష్‌, వసురాంనాయక్‌, తోక తిరుమలయ్య, రవికుమార్‌ నాయక్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement