పీఎం శ్రీ బడుల్లో ప్రత్యేక విద్యా బోధకులు | - | Sakshi
Sakshi News home page

పీఎం శ్రీ బడుల్లో ప్రత్యేక విద్యా బోధకులు

Oct 4 2026 10:55 AM | Updated on Oct 4 2026 10:55 AM

8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి..

● ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధన, సహాయక సేవలు

● ఐదు నెలల నియామకం..

నెలకు రూ.16,500 వేతనం

● ఉమ్మడి జిల్లాలో 104 మంది గెస్ట్‌ స్పెషల్‌ ఎడ్యుకేటర్ల నియామకం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీఎం శ్రీ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మెరుగైన విద్య, సహాయక సేవలు అందించేందుకు ప్రభుత్వం గెస్ట్‌ స్పెషల్‌ ఎడ్యుకేటర్లను నియమించనుంది. ఐదు నెలల కాలానికి చేపట్టనున్న ఈ నియామకాల్లో ఒక్కొక్కరికి నెలకు రూ.16,500 వేతనం చెల్లించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 104 పీఎం శ్రీ పాఠశాలల్లో వీరిని నియమించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కాగా.. పీఎం శ్రీ పాఠశాలలతో పాటు క్లస్టర్‌, మండల, కాంప్లెక్స్‌ పరిధిలోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు గెస్ట్‌ స్పెషల్‌ ఎడ్యుకేటర్లు సేవలు అందించాల్సి ఉంటుంది. కంటిచూపు, వినికిడి, శారీరక వైకల్యం, మేధోపరమైన వైకల్యం తదితర సమస్యలు ఉన్న విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన అందించనున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని మండల కేంద్రాల్లోని భవిత సెంటర్ల ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవలు అందుతున్నాయి. పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రత్యేక విద్యా బోధకుల నియామకంతో వారికి మరిన్ని సేవలు అందనున్నాయి.

ఐదు నెలల కాలానికి గెస్ట్‌ స్పెషల్‌ ఎడ్యుకేటర్ల నియామకం చేపడుతున్నాం. స్పెషల్‌ బీఈడీ, బీఈడీ జనరల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ డిప్లొమా, పీజీ డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు సంబంధిత పీఎం శ్రీ పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలి. – విజయకుమారి, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement