తమ పంటలు ఎండుతున్నాయని.. సాగునీరు విడుదల చేయాలంటూ జూరాల ఆయకట్టు రైతులు గత నెల 18వ తేదీ నుంచి ఐదురోజుల పాటు ఆందోళనబాట పట్టగా.. వారికి బీజేపీ, సీపీఎం, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు మద్దతు పలికారు. ఆయా పార్టీల ప్రధాన నాయకులను అరెస్టు చేయడం వంటి ఘటనతో ఆగ్రహించిన రైతులు ఏకంగా జూరాల ప్రధాన ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేలేటరీ షట్టర్లు తెరిచి నీటిని వదులుకున్నారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం పక్క రాష్ట్రమైన కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి పంటల సమయం వరకు 5 టీఎంసీల నీరు ఇవ్వాలని కోరగా.. 3 టీఎంసీల నీటిని వదిలింది.


