భూ సేకరణకు రైతులు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

భూ సేకరణకు రైతులు సహకరించాలి

Oct 1 2026 1:05 AM | Updated on Oct 1 2026 1:05 AM

ఖిల్లాఘనపురం: ఖిల్లాఘనపురం బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి డి–5, డి–8 కాల్వల తవ్వకాల్లో భూములు కోల్పోతున్న రైతులు ముందుకొచ్చి అంగీకార పత్రాలపై సంతకాలు చేస్తే నెలరోజుల్లో పరిహారం చెల్లింపునకు తగిన చర్యలు తీసుకుంటామని భూ సేకరణ అదనపు కలెక్టర్‌ తిరుపతయ్య తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేధికలో ఖిల్లాఘనపురం, షాపురం, గట్టుకాడిపల్లి, మానాజీపేట గ్రామాల భూ నిర్వాసితులతో ఐబీ డీఈ బాబుచంద్‌తో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్వతాపురం శివారులో 55 మంది రైతులకు సంబంధించి 20.26 ఎకరాల భూమి కాల్వ కోసం సేకరించినట్లు చెప్పారు. ఈ భూములకు ఎకరాకు రూ.13 లక్షల పరిహారం, డి–8 కాల్వకు భూములిస్తున్న రైతులకు అక్కడి విలువను బట్టి ఎకరాకు రూ.14.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పెద్దలు ఆగారం ప్రకాష్‌, రాములు, దేవేందర్‌, ఐబీ ఏఈ లక్ష్మారెడ్డి, డీటీ ఆసిఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement