పర్యాటక కేంద్రంగా పాన్‌గల్‌ ఖిల్లా కోట | - | Sakshi
Sakshi News home page

పర్యాటక కేంద్రంగా పాన్‌గల్‌ ఖిల్లా కోట

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

పాన్‌గల్‌: మండల కేంద్రమైన పాన్‌గల్‌ ఖిల్లా కోటతో పాటు మాధరావుపల్లిలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వేదికై న ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పురావస్తుశాఖ అధికారుల బృందం పేర్కొంది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో సోమవారం ఆయా ప్రాంతాలను స్థానిక నాయకులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పాన్‌గల్‌ ఖిల్లా కోటపై ఉన్న చారిత్రాక కట్టడాల వివరాలను సేకరించారు. మాధరావుపల్లిలో వినోబా భావే, నెహ్రూ బసచేసిన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రెండు, మూడు రోజుల్లో సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఖిల్లా కోట, మాధరావుపల్లి వేదికల గురించి గైడ్‌లు వడ్దె పాపయ్య , గడ్డం మహేశ్‌ అధికారుల బృందానికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్‌ ప్రొ.అర్జున్‌రావు కుతాడి, ఇంజినీర్‌ నర్సింగ్‌ నాయక్‌, డైరెక్టర్‌ ఓఎస్‌డీ రాజు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సాయికిరణ్‌, కాంగ్రెస్‌ నాయకులు బ్రహ్మాయ్య, నరేందర్‌గౌడ్‌, రాంచందర్‌, మధుసూదన్‌ ఉన్నారు.

సీఈసీ రాజీనామా చేయాలి

వనపర్తి రూరల్‌: ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సర్‌ ప్రక్రియపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సర్‌ ప్రక్రియలో ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయత, పారదర్శకతపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిచో అక్టోబర్‌ 1న జిల్లా కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, ఎండీ జబ్బార్‌, చీర్ల సత్యంసాగర్‌, మెకానిక్‌ శ్రీనివాసులు, ఖాదర్‌పాషా, రమేశ్‌, గణేశ్‌, ఎం.పరమేశ్వరాచారి, బీసన్న, భాస్కర్‌, ఉమ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement