మంత్రుల దృష్టికి టెనెంట్‌ సమస్య | - | Sakshi
Sakshi News home page

మంత్రుల దృష్టికి టెనెంట్‌ సమస్య

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

కొత్తకోట: మున్సిపాలిటీలోని రాఘవేంద్ర, బీసీ కాలనీల్లో నెలకొన్న టెనెంట్‌ సమస్యపై ఈ నెల 21న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘టెనెంట్‌ ఇక్కట్లు’ కథనానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి స్పందించారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షలో టెనెంట్‌ సమస్యను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు రెవెన్యూశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ లోకేశ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాఘవేంద్ర కాలనీ, బీసీ కాలనీ ఏర్పడి సుమారు 50 ఏళ్లు అవుతోందని.. ప్రస్తుతం 400 పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని ఎమ్మెల్యే వారికి వివరించారు. అక్కడ సాగుభూమి లేదని.. టెనెంట్‌ కేసుతో కాలనీవాసులు తమ ఇళ్లు, ప్లాట్లను విక్రయించలేకపోతున్నారని తెలిపారు. అలాగే కొత్తగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రావడం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్తులను తాకట్టు పెట్టుకునే అవకాశం కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. టెనెంట్‌ సమస్యను వెంటనే పరిష్కరించి.. కాలనీలో ఆస్తుల క్రయ, విక్రయాలు, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement