వనపర్తి: పదోన్నతులు మరిన్ని బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ డి.సునీతారెడ్డి అన్నారు. జిల్లాలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న వెంకటనాగరాజు ఎస్‌ఐగా, హెడ్ కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజేందర్‌రెడ్డి, బాలీశ్వర్‌రెడ్డి ఏఎస్‌ఐలుగా పదోన్నతి పొందారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వారిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా పోలీసు సిబ్బంది పదోన్నతులు పొందడం ఆనందదాయకమన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ.. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు తగిన న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.


