పాన్‌గల్: వీబీజీ రాంజీ పథకంలో చేపట్టే పనుల ప్రణాళికలను ప్రజల భాగస్వామ్యంతోనే పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి పద్మజ అన్నారు. మంగళవారం మండలంలోని బుసిరెడ్డిపల్లిలో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ (వీజీపీపీ)పై నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ రిసోర్స్ మ్యాప్, గ్రామ వనరుల పటం వేసి గ్రామంలో ఉండే వనరులు, వీబీజీ రాంజీ పథకంలో చేపట్టాల్సిన పనులను గ్రామస్తుల భాగస్వామ్యంతో గుర్తించారు. గ్రామానికి అవసరమైన పనులు, వ్యక్తిగతంగా, కమ్యూనిటీపరంగా అవసరం ఉన్న పనులను గ్రామస్తులకు వివరించారు. ఆయా అంశాలపై పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలకు శిక్షణనిచ్చి అవగాహన కల్పించారు. అక్టోబర్ 2 నుంచి ప్రతి గ్రామపంచాయతీలో గ్రామానికి సంబంధించిన ప్రణాళికలను గ్రామసభలు నిర్వహించి ఆమోదించాలన్నారు. గ్రామంలో ఉండే కూలీల బడ్జెట్‌కు అనుగుణంగా పనులు గుర్తించాలని సూచించారు. సమావేశంలో సునంద, ఎంపీడీఓ గోవిందరావు, ఏపీఓ కుర్మయ్య, సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి , పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే సమగ్ర గ్రామాభివృద్ధి..
వనపర్తి రూరల్: గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, టీజీఐఆర్‌డీ జాయింట్ డైరెక్టర్ పద్మజ సూచించారు. మంగళవారం పెబ్బేరు మండలం బునాదిపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వీబీజీ రాంజీ గ్రామపంచాయతీ ప్రణాళిక తయారీపై పీఆర్‌ఏ విధానంలో నిర్వహించిన శిక్షణలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామ అవసరాలు, సమస్యలు, వనరులు, అభివృద్ధి అవకాశాలను ప్రజలతో కలిసి గుర్తించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఆర్డీఓ రామేశ్వర్‌రెడ్డి, డీపీఓ రఘునాథ్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటేష్, ఎంపీఓ రోజ, సర్పంచ్ విజయ్‌గౌడ్, ఏపీఓ నర్సింహారెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


