ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని చెప్పినా జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో
వరి సాగుకే రైతులు మొగ్గు చూపారు. ఎల్‌నినో ప్రభావంతో గతేడాది కంటే ఈసారి 61 వేల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం తగ్గిందని అధికార లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది 1,90,002 ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా వేయగా 1,74,691 ఎకరాల్లో సాగైంది. అలాగే పత్తి 17,237 ఎకరాలకుగాను 13,879 ఎకరాలు.. మినుములు 38,970 ఎకరాలకుగాను 11,945 ఎకరాలు, కంది 5,464 ఎకరాలకుగాను 3,962 ఎకరాల్లో సాగు చేశారు. వేరుశనగ 30054 ఎకరాలకు అంచనా వేయగా 5333 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 10,923 ఎకరాలకుగాను 6,956 ఎకరాలు.. జొన్న 1,154 ఎకరాలకుగాను 1,149 ఎకరాలు.. ఆముదం 691 ఎకరాలకుగాను 426 ఎకరాలు సాగు చేశారు. ఉద్యాన పంటల విషయానికొస్తే ఆయిల్‌పాం 2,600 ఎకరాలకుగాను 701 ఎకరాలు.. కూరగాయలు 10 వేల ఎకరాలు సాగు అంచనా వేయగా కేవలం 4,182 ఎకరాలు మాత్రమే సాగైంది.


