రైతులకు నీరందించకపోతే పోరాటాలు ఉధృతం | - | Sakshi
Sakshi News home page

రైతులకు నీరందించకపోతే పోరాటాలు ఉధృతం

Sep 23 2026 12:37 AM | Updated on Sep 23 2026 12:37 AM

భూత్పూర్‌: జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా రైతులకు నీరందించకపోతే రైతుల పక్షాన పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి జూరాల ప్రాజెక్టు వైపు వెళ్తున్న ఆయనను భూత్పూర్‌ పోలీసులు అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటలు సాగు చేయరాదని ముందుగానే వ్యవసాయశాఖ గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. అయితే రైతులు పంటలు సాగు చేసి ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు ఖర్చు చేసిన తర్వాత ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.సాగర్‌, ఆర్‌.వెంకట్రాములు, విజయ్‌కుమార్‌, కిల్లె గోపాల్‌, నల్లవెల్లి కురుమూర్తి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement