వనపర్తిటౌన్: కనుమరుగవుతున్న సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు భక్తిభావాన్ని పెంపొందించేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దోహదపడతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో 15 రోజుల పాటు నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయాగంలో గురువారం నిరంజన్‌రెడ్డి, వాసంతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వశాంతి కోసం ఇంతటి మహాయాగాన్ని నిర్వహించడం వనపర్తికి ప్రత్యేకతను తీసుకొస్తుందని పేర్కొన్నారు. ప్రజలు సుభిక్షంగా, సౌభాగ్యంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పూర్ణాహుతి అనంతరం వేదపండితులు నిరంజన్‌రెడ్డి దంపతులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పలుస రమేష్‌గౌడ్, వాకిటి శ్రీధర్, గట్టుయాదవ్, వనం రాములు, దిలీప్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


