12న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

12న జాతీయ లోక్‌ అదాలత్‌

Sep 8 2026 1:11 AM | Updated on Sep 8 2026 1:11 AM

వనపర్తి టౌన్‌: కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ సువర్ణ అవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ బాకరాజు శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని. సివిల్‌, వివాహ సంబంధిత, మోటారు ప్రమాద క్లెయిమ్స్‌, చెక్‌ బౌన్స్‌, రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. రాజీతో సమయం, డబ్బు ఆదా అవుతుందని.. ఇప్పటికే చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి చెల్లిస్తారని, లోక్‌ అదాలత్‌ తీర్పుపై అప్పీల్‌ ఉండదని వివరించారు.

4 యూనిట్లలో విద్యుదుత్పత్తి

ఆత్మకూర్‌: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. సోమవారం ఎగువన 2 యూనిట్ల నుంచి 78 మెగావాట్లు, 102.277 మి.యూ., దిగువన 2 యూనిట్ల నుంచి 80 మెగావాట్లు, 88.880 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో 191.157 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు.

విద్యారంగంలో మొదటి స్థానంలో నిలపాలి

వనపర్తిటౌన్‌: విద్యాశాఖ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందువరుసలో నిలపాలని ఇన్‌చార్జ్‌ జిల్లా విద్యాధికారి యాదయ్య ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌న్‌హాల్‌లో విద్యాశాఖ కార్యక్రమాల అమలుపై సమగ్ర శిక్ష విభాగం సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల సీఆర్పీలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ప్రత్యేక అవసరాల పిల్లల విద్యాసిబ్బంది, సమాచార సాంకేతిక బోధకులు పాల్గొన్నారు. డిజిటల్‌ విద్యాబోధన, ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్య తదితర అంశాల గురించి వివరించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాల గురించి బాలల రక్షణ అధికారి రాంబాబు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ఈగల్‌ బృందం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజద్‌ అవగాహన కల్పించారు. విద్యాశాఖ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని కార్యక్రమ పర్యవేక్షణ అధికారి ప్రతాప్‌రెడ్డి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement