రింగ్‌లో పంచ్‌.. మెడలో మెడల్స్‌! | - | Sakshi
Sakshi News home page

రింగ్‌లో పంచ్‌.. మెడలో మెడల్స్‌!

Sep 7 2026 12:33 AM | Updated on Sep 7 2026 12:33 AM

బాక్సింగ్‌లో సత్తా చాటుతున్న

ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

పంచ్‌ పవర్‌తో పతకాలు సాధిస్తున్న

నలుగురు బాక్సర్లు

బాక్సింగ్‌ రింగ్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా క్రీడాకారులు పంచ్‌ పవర్‌ చూపించారు.

హైదరాబాద్‌లో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో నలుగురు క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారు. పెబ్బేర్‌ మండలం శాగాపూర్‌కు చెందిన శ్రీలేఖ స్వర్ణ పతకం సాధించి దక్షిణ భారత చాంపియన్‌షిప్‌కు ఎంపిక కాగా.. మహబూబ్‌నగర్‌కు చెందిన ఎం.రాజు, నాగర్‌కర్నూల్‌ జిల్లా శశికాంత్‌ రజత పతకాలు, గండేడ్‌కు చెందిన జె.రాకేష్‌ కాంస్య పతకం సాధించారు. వరుస విజయాలతో జిల్లాలో బాక్సింగ్‌పై ఆసక్తి పెరుగుతోంది.

శ్రీలేఖ.. స్వర్ణ పంచ్‌

నపర్తి జిల్లా పెబ్బేర్‌ మండలం శాగాపూర్‌కు చెందిన శ్రీలేఖ ఏడేళ్లుగా బాక్సింగ్‌లో శిక్షణ పొందుతూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. తొమ్మిదిసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఏడు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు సాధించింది. జిల్లాస్థాయిలో మూడు స్వర్ణాలు, ఒక రజతం ఆమె ఖాతాలో ఉన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 48–51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన శ్రీలేఖ.. ఈనెల 16 నుంచి 19 వరకు బెంగళూరులో జరిగే ఎలైట్‌ పురుషుల, మహిళల సౌత్‌ ఇండియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు ఎంపికై ంది. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని చెబుతోంది.

– మహబూబ్‌నగర్‌ క్రీడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement