రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి | - | Sakshi
Sakshi News home page

రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి

Sep 7 2026 12:33 AM | Updated on Sep 7 2026 12:33 AM

ఆత్మకూర్‌: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. ఆదివారం ఎగువన 1 యూనిట్‌ నుంచి 39 మెగావాట్లు, 102.058 మి.యూ., దిగువన ఒక యూనిట్‌ నుంచి 40 మెగావాట్లు, 88.010 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జలవిద్యుత్‌ కేంద్రాల్లో 190.068 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు.

డీవైఎఫ్‌ఐ జిల్లా

కార్యవర్గం ఎన్నిక

అమరచింత: డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం మండల కేంద్రంలో జరిగిన సంఘం జిల్లా మహాసభల్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనగంటి వెంకటేష్‌ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడి మహేష్‌, ఉపాధ్యక్షులుగా ఆది, హరీశ్‌, కార్యదర్శిగా రాఘవేంద్ర, సహాయ కార్యదర్శులుగా రామకృష్ణ, సురేష్‌, సభ్యులుగా చంటి, షారుఖ్‌, శ్రీకాంత్‌, కళ్యాణ్‌, మొగిలి, దశరథ్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. నిరుద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడానికి ప్రణాళికతో ముందుకు సాగుతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement