వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు పరిసరాల శుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణ, దోమల నియంత్రణపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దోమల లార్వా వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్యశాఖతో పాటు మున్సిపల్, పంచాయతీ శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాను డెంగీ, ఇతర సీజనల్ వ్యాధుల నుంచి రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. భాస్కర్‌నాయక్, ఐఎంఏ అధ్యక్షుడు డా. బాబు, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యాధికారులు పాల్గొన్నారు.


