శ్రీ గురుదత్త ఇండస్ట్రీస్‌లో ‘విజిలెన్స్‌’ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

శ్రీ గురుదత్త ఇండస్ట్రీస్‌లో ‘విజిలెన్స్‌’ తనిఖీ

Aug 26 2026 12:42 AM | Updated on Aug 26 2026 12:42 AM

రూ.24 విలువైన

వరి ధాన్యం మాయం

ఖిల్లాఘనపురం: మండలంలోని శ్రీ గురుదత్త ఇండస్ట్రీస్‌లో రూ.24 కోట్ల ఽవిలువైన వరి ధాన్యం పక్కదారి పట్టిందని ఇన్‌చార్జ్‌ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, డీఎం ఆంజనేయులు తెలిపారు. మంగళవారం రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యూనిట్‌–2 బృందం, జిల్లా పౌరసరఫరాలశాఖ సంయుక్తంగా మండలంలోని పర్వతాపురం శివారులో ఉన్న శ్రీ గురుదత్త ఇండస్ట్రీస్‌లో తనిఖీలు నిర్వహించిందన్నారు. ఈ మిల్లుకు ప్రభుత్వం 2022–23, 2023–24 యాసంగి, 2023–24 వానాకాలం మొత్తం మూడు సీజన్లలో 2,40,189.40 క్వింటాళ్ల వరి ధాన్యం కేటాయించిందని తెలిపారు. ఇప్పటి వరకు సీఎంఆర్‌కు అప్పగించిందిపోను 2,02,731 బ్యాగులకుగాను ప్రస్తుతం మిల్లులో కేవలం 14,692 బ్యాగులు మాత్రమే ఉన్నాయని వివరించారు. 1,88,034 బ్యాగులు లేవని.. వీటి విలువ సుమారు రూ.24 కోట్ల చెప్పారు.

మొక్కల సంరక్షణఅందరి బాధ్యత

కొత్తకోట రూరల్‌: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ కోరారు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఆయన మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం నర్సరీని పరిశీలించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వివిధ ప్రభుత్వ శాఖలకు ఇచ్చిన లక్ష్యం మేర మొక్కలు నాటాలని.. వాతావరణ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీపీఓ రఘునాథ్‌రెడ్డి, ఎంపీడీఓ పరిణత, సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

జెన్‌కో వద్ద కార్మికుల ఆందోళన

ఆత్మకూర్‌: దిగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు కార్మికులను అకారణంగా తొలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో కా ర్మికులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జీఎస్‌ గోపి, మండల కార్యదర్శి రాజు పాల్గొని మాట్లాడుతూ.. 16 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగించడం బాధాకరమన్నారు. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని.. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై అధికారులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కార్యక్రమంలో నాయకులు కురుమూర్తి, సత్యం, పాండు, భాస్కర్‌, ప్రమోద్‌, రవి, కుర్మన్న, రాజు, సత్యనారాయణ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement