పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు

Aug 26 2026 12:42 AM | Updated on Aug 26 2026 12:42 AM

వనపర్తి: పర్యాటకులను ఆకర్శించే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తగిన చేపట్టాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు వర్షాభావ పరిస్థితులు, నీట్‌–పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్‌ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు ఎన్‌.ఖీమ్యానాయక్‌, వినోద్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమావేశమై మాట్లాడుతూ.. పర్యాటకులను ఆకర్శించే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రదేశాల సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, వ్యవసాయం, సాగు, తాగునీటి లభ్యతపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరుతడి పంటలకు ప్రాధాన్యతనిస్తూ రైతులు సాగుచేసే విధంగా వ్యవసాయశాఖ అధికారులు ప్రోత్సహించాలని కోరారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరి కాకుండా మినుములు, వేరుశనగ తదిర ఆరుతడి పంటలను సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, జిల్లా పర్యాటకశాఖ అధికారి సుధీర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement