జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం బోనాల ఉత్సవాన్ని ప్రజలు ఆనందోత్సహాలతో జరుపుకొన్నారు. మహిళలు, యువతులు పసుపు,
కుంకుమ, పూలు, వేపాకులు, గంధం తదితర వాటితో అందంగా అలంకరించిన బోనపు కుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని తీసుకొని ఊరేగింపుగా అమ్మవారి ఆలయాలకు చేరుకున్నారు. అక్కడ నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు ఆలయాల ఎదుట కోడిపుంజులు, గొర్రెపొటేళ్లను బలిచ్చారు. ఊరేగింపులో కొందరు మహిళలు పునకాలతో ఊగిపోయారు. యువత డప్పుచప్పుళ్లకు
అనుగుణంగా నృత్యాలు చేశారు. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. – పాన్‌గల్, ఖిల్లా ఘనపురం


