వానాకాలంలో వర్షంపై ఆధారపడి పంటలు సాగుచేసుకుంటున్నా. ఏడాదికి ఒకపంట సాగుచేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ఈసారి మూడు ఎకరాల్లో పత్తి సాగుచేయడానికి రూ.60 వేలు ఖర్చుచేశా. మొదట్లో వర్షాలు కురిసినా.. తర్వాత లేకపోవడంతో పంట ఎదుగుదల ఆశించిన మేర లేక సత్తువ కోల్పోయింది. అక్కడక్కడ పచ్చగా ఉన్నా.. పూత రావడం లేదు.
– పోసిరిగారి వెంకటన్న, రైతు, అమరచింత
కంది వేసినా ఫలితం శూన్యం
ఐదెకరాల్లో పత్తి సాగు చేయడానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టా. నీటి వసతి లేకపోవడంతో వర్షాల కోసం ఎదురుచూసినా ఆశించిన మేర కురవక మొక్కలు ఎండుముఖం పట్టాయి. దీంతో చేసేది లేక దుక్కిదున్ని కంది విత్తనాలు నాటాను. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో ఆ కంది మొక్కలు కూడా సరిగా పెరగక పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదు. – పుట్టపల్లి రామలు, రైతు, అమరచింత
అప్పులే మిగిలాయి..
వర్షంపై ఆధారపడి ఆరు ఎకరాల్లో పత్తి సాగుచేశా. ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి అయింది. వర్షాలులేక గింజలు వాడుముఖం పట్టాయి. చేసేది లేక మరోమారు పొలాన్ని దున్ని పత్తి విత్తనాలు వేసినా ఆశించిన మేర ఫలితం కనిపించడం లేదు. – రాములు, రైతు, అమరచింత


