వాన.. వాన..
జిల్లాలోని 12 మండలాల్లో కురిసిన వర్షం
మండలాల వారీగా ఇలా.. (మి.మీ.లలో..)
● అధికంగా పెద్దమందడిలో 24.8 మి.మీ.
● మెట్ట పంటలకు జీవం..
అన్నదాతల్లో చిగురించిన ఆశలు
● వాతావరణంలో ఒక్కసారిగా మార్పు
–8లో u
జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 98 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా.. అందులో వరి ఒక్కటే 78 వేల ఎకరాల వరకు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. వరి నాట్లు కొనసాగుతున్న సమయంలో వర్షం కురవడం రైతులకు కొంత ఊరటనిచ్చినట్లయింది. మరో ఇరవై వేల ఎకరాల వరకు మెట్ట పంటలైన జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, పత్తి సాగు చేశారు.
వనపర్తి: వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎదురుచూస్తున్న వర్షం బుధవారం జిల్లాలోని నేలను తడిపేసింది. వర్షాధారంగా సాగు చేసిన పంటలకు ఈ వర్షంతో జీవం పోసినట్లయింది. జిల్లాలో అత్యధికంగా పెద్దమందడిలో 24.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు నివేదిక విడుదల చేశారు. వర్షాభావంతో ఆందోళనలో ఉన్న అన్నదాతల్లో సాగు ఆశలు చిగురించాయి. కొద్దిరోజులుగా ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుండగా, బుధవారం ఉదయం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. మేఘాలు కమ్ముకొని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి తదితర పంటలకు కొంత మేలు చేసింది. ఇటీవల వర్షాలు కురువక మొక్కల ఎదుగుదల మందగించడంతో పాటు పలుచోట్ల వాడిపోతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా కురిసిన వర్షంతో భూమిలో తేమశాతం పెరిగి పంటలు కోలుకునే అవకాశాలు మెరుగుపడ్డాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు, మూడురోజులు ఇదే తరహాలో వర్షాలు కురిస్తే సాగు పూర్తిగా గాడిన పడుతుందని వ్యవసాయశాఖ అధికారులు, రైతులు భావిస్తున్నారు. ఎన్‌నినో ప్రభావంతో ఈ వర్షాకాలం ఇక పంటలు సాగినట్లే అని నిరాశలో ఉన్న రైతులకు ఈ వర్షంతో ఊరట లభించిందని చెప్పవచ్చు. వర్షంతో చెరువులు, కుంటలకు నీరు చేరకపోయినా.. నేల బాగా తడిసింది. ఇకపై కురిసే వర్షాలకు నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది.
నాలుగు మండలాల్లో నిల్..
జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉండగా.. చిన్నంబావి, పాన్‌గల్, శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లో బుధవారం ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు. మిగతా 11 మండలాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. పెద్దమందడి, అమరచింత, కొత్తకోట, మదనాపురం మండలాల్లో 15 మిల్లిమీటర్లకుపైబడి, మరో ఏడు మండలాల్లో 10.3 మి.మీ. అంతకంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
మదనాపురంలో కురుస్తున్న వర్షం
అమరచింత: మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు బుధవారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు అధికారులు సాగునీటిని విడుదల చేశారు. వరి నారుమడులు వేసుకున్నామని.. ఎగువ నుంచి వరద వస్తున్నందున కాల్వకు సరఫరా చేయాలని ఆయకట్టు రైతులు కోరడంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించి సాగునీటిని విడుదల చేయించినట్లు కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజుగౌడ్ సమస్యను పలుమార్లు మంత్రి వాకిటి దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు నీటి విడుదల సాధ్యమైందన్నారు.


