జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద
● వరి సాగుకు సన్నద్ధమవుతున్న
ఆయకట్టు రైతులు
● ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో
85 వేల ఎకరాల ఆయకట్టు
● నీటి విడుదలపై స్పష్టత లేదంటున్న అధికారులు
●
నేను ఇప్పటికే 16 ఎకరాల్లో వరి సాగు చేశాఆ. బోరు ద్వారా పారే నీరు సరిపోక ఎండుముఖం పడుతోంది. జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ప్రధాన ఎడమ కాల్వ ద్వారా విడుదల చేసి పంట ఎండిపోకుండా కాపాడాలి.
– ఎర్రన్న, రైతు, మూలమళ్ల
జూరాల ప్రధాన ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకానికి సైతం నీటిని అందించడంతో ఆయకట్టు రైతులు వరి సాగుచేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నారుమడులను సిద్ధం చేసుకొని సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చొరవచూపి సాగునీరు అందించి ఆదుకోవాలి.
– కృష్ణారెడ్డి, రైతు, అమరచింత
ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఇప్పుడిప్పుడే ఎగువ నుంచి వరద వచ్చి చేరుతోంది. సాగునీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అధికారికంగా ఆదేశాలు వస్తే తప్ప సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వలేం.
– షమీ ఉల్లా, డీఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు రెండ్రోజులుగా ఎగువ నుంచి వరద చేరుతుండటంతో ఆయకట్టు రైతుల్లో సాగు ఆశలు చిగురించాయి. కాల్వలకు ఎలాగైనా నీటిని వదులుతారని వరి నారుమడులు సిద్ధం చేసుకోవడంతో పాటు పొలాలు దుక్కిదున్ని చదును చేసే పనులకు సిద్ధమయ్యారు. యాసంగిలో కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందడంతో.. ఈ ఏడాది వానాకాలంలో పూర్తి ఆయకట్టు 85 వేల ఎకరాలకు సాగునీరు వదులుతారని ఆశించారు. ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు కురవకపోవడం.. ప్రాజెక్టుకు సకాలంలో వరద చేరకపోవడంతో ఆశలు వదులుకున్నారు. కాగా ఆయకట్టు పరిధిలో అక్కడక్కడ బోరుబావులున్న రైతులు వరి నారుమడులు వేసుకున్నారు. మిగిలిన రైతులు కాల్వ ద్వారా ఎప్పుడు నీరు వస్తుందోనని ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఎగువనున్న నారాయణపూర్ డ్యాం క్రస్ట్‌గేట్లు తెరిచి రెండోజ్రులుగా నీటిని వదలడంతో జూరాలకు 18,300 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నందిమళ్ల శివారులో వరి నారుమడి


