నేను ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వస్తుంటాం. అక్కడ ఓటు వద్దని.. ఇక్కడే ఉంచుకున్నా. ఏ ఎన్నిక వచ్చినా సొంత ఊరుకు వచ్చి ఓటు వేయడం ఇష్టం. అందుకోసం ఎన్యూమరేషన్ ఫారం నింపి వెళ్లాను. మా ఓటు మా ఊరిలో ఉంటేనే ఆనందం.
– కట్టా జనార్దన్‌రెడ్డి, ఉప్పునుంతల
అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా బీఎల్‌ఓలు చొరవ చూపాలి. ఆగస్టు 3 వరకు ఇంటింటి సర్వే చేపట్టి.. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టాక 10న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ఆపై అభ్యంతరాలు స్వీకరించి.. పరిశీలన అనంతరం 12న తుది ఓటరు జాబితా విడుదలవుతుంది. డిజిటలైజేషన్ వందశాతం పూర్తయ్యేలా రాజకీయ పార్టీల నాయకుల సహకరించాలి.
– హేమంత కేశవ పాటిల్, కలెక్టర్
●


