‘నకిలీ’పై నజర్‌..! | - | Sakshi
Sakshi News home page

‘నకిలీ’పై నజర్‌..!

Jul 26 2026 7:48 AM | Updated on Jul 26 2026 7:48 AM

ఇద్దరు డీలర్ల అరెస్టు..

జిల్లాలో విస్తృతంగా వ్యవసాయ అధికారుల స్పెషల్‌ డ్రైవ్‌

చిన్నంబావి ఘటనతో రంగంలోకి..

ఇద్దరు డీలర్ల అరెస్ట్‌

నాణ్యతపై రైతుల్లో పెరుగుతున్న

అనుమానాలు

వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా నకిలీ ఎరువులు వెలుగు చూస్తున్న నేపథ్యం.. జిల్లాలోని చిన్నంబావి మండలం వెల్టూరులో అక్రమ డీఏపీ విక్రయాల ఘటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని 15 మండలాల వ్యవసాయశాఖ అధికారులతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ జిల్లాలోని సుమారు 300కుపైగా ఉన్న ఫర్టిలైజర్‌ దుకాణాల్లోని ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నిల్వలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ అనధికారిక ఎరువుల విక్రయాలు జరిగినా, లైసెన్స్‌ పొందిన కంపెనీలు కాకుండా ఇతర కంపెనీల ఎరువులు, పురుగు మందులు విక్రయించినా కఠిన చర్యలు తీసుకునేలా నిఘా పెంచారు.

అనధికారిక మిశ్రమ ఎరువుల పట్టివేత..

అధికారుల స్పెషల్‌ డ్రైవ్‌లో రాష్ట్ర ఎకై ్సజ్‌మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకాలోని పాన్‌గల్‌ మండలంలో ఉన్న ఓ ఫర్టిలైజర్‌ దుకాణంలో ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేసిన అనధికార ఎరువు (మిశ్రమ ఎరువు) 25 బస్తాలు పట్టుబడింది. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ ఎరువుల విక్రయాల ఘటనలు వెలుగుచూస్తున్న వేళ సమీప మండలంలో అక్రమ డీఏపీ విక్రయంలో పోలీసు కేసులు, అరెస్టులు అవుతున్నా.. సదరు దుకాణ యజమాని అనధికారిక మిశ్రమ ఎరువును రైతులకు విక్రయించేందుకు గోదాంలో నిల్వ చేయడం శోచనీయం.

ల్యాబ్‌కు నమూనాలు..

అనధికారికంగా రైతులకు విక్రయించిన డీఏపీ నమూనాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. నివేదికలు వచ్చేందుకు కనీసం 15 రోజుల వ్యవధి పడుతుండగా.. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. రిపేర్టు నకిలీ అని వస్తే.. కోర్టులో దాఖలు చేసే చార్జిషీట్‌లో ఈ విషయాన్ని పోలీసులు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి.

అప్రమత్తమైన రైతులు..

నకిలీ, అనధికారిక ఎరువుల విక్రయాల ఘటనలతో అప్రమత్తమైన రైతులు ఎరువులు కొనుగోలు చేసేందుకు వెళ్లినప్పుడు అక్కడి బస్తాల ఫొటోలను ఆయా మండలాల ఏఓలకు పంపిస్తున్నారు. వారు పరిశీలించి అనుమతించిన తర్వాతే కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం.

జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఎరువులు, యూరియా నిల్వలు (మెట్రిక్‌

టన్నుల్లో..)

చిన్నంబావి మండలం వెల్టూరులో అనధికారిక డీఏపీ విక్రయాలను గుర్తించి వ్యవసాయశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేసునమోదు చేశారు. వారిలో ఇద్దరిని ఇటీవలే అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. వీరిలో ఒకరు గద్వాల జిల్లాకు చెందిన వారు కాగా.. మరొకరు జిల్లాలోని పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన ఫర్టిలైజర్‌ దుకాణ యజమాని. మరొకరు హైదరాబాద్‌లో అనధికార ఎరువులను స్టాక్‌ చేసిన వ్యక్తి ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడైన అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement