30 ఏళ్లుగా పనిచేస్తున్నా.. | - | Sakshi
Sakshi News home page

30 ఏళ్లుగా పనిచేస్తున్నా..

Jul 25 2026 12:41 AM | Updated on Jul 25 2026 12:41 AM

30 ఏళ్లుగా పనిచేస్తున్నా.. పేదలకు మేలు జరిగేలా చూడాలి.. పూజల పునరుద్ధరణకు చర్యలు..

ఆలయంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నా. అర్చకుడు మరణించి రెండేళ్లు గడుస్తుంది. నాటి నుంచి ఆలయం మూతబడింది. ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో మేలు జరుగుతుందని భావించా. అర్చకుడు బతికి ఉన్నప్పుడు కూడా నెలకు రూ. వెయ్యి మాత్రమే ఇచ్చేవారు. ఉన్నతాధికారులు స్పందించి ఆలయాన్ని తెరిపించాలి.

– బాలీశ్వరమ్మ, స్వీపర్‌, వీపనగండ్ల

ఆలయ భూములు పేదలు సాగు చేసుకునేలా చేస్తే ఆర్థికంగా బలపడుతారు. ఒకే వర్గానికి చెందినవారు ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారేగాని కనీసం అర్చకుడిని కూడా నియమించడం లేదు. దేవాదాయశాఖ అధికారుల ఏక పక్ష నిర్ణయం సరికాదు. ఉన్నతాధికారులు స్పందించి భూముల వేలం నిర్వహిస్తే ఆదాయం సమకూరడంతో పాటు నిత్య పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి.

– ఎత్తం కృష్ణయ్య, మాజీ అధ్యక్షుడు,

మండల రైతుబంధు సమితి

చెన్నకేశవస్వామి ఆలయ భూములను అదే గ్రామానికి చెందిన పలువురు రైతులు సిట్టింగ్‌ టెనెంట్‌ యాక్టు కింద మూడేళ్లు సాగు చేసుకునేందుకు దేవాదాయశాఖ కమిషరేట్‌ నుంచి ఆర్డర్‌ తెచ్చుకున్నారు. గ్రామానికి చెందిన మరికొందరు సాగుహక్కు కోసం నిరాహార దీక్షలు చేస్తున్నట్లు తెలిసింది. గ్రామంలో పర్యటించి సమస్యను పూర్తిగా తెలుసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం. ఆలయంలో నిత్య పూజలు కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లను వీలైనంత త్వరలో చేపడతాం.

– శేఖర్‌గౌడ్‌, ఈఓ,

దేవాదాయశాఖ, వనపర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement