పారదర్శకంగా భూముల రీ సర్వే | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా భూముల రీ సర్వే

Jul 25 2026 12:41 AM | Updated on Jul 25 2026 12:41 AM

ఖిల్లాఘనపురం: పారదర్శకంగా భూముల రీ సర్వే చేపడుతున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని మల్కాపురం గ్రామం ల్యాండ్‌ రీ సర్వేకు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికై ంది. సర్వే గురించి గ్రామస్తులకు వివరించేందుకు శుక్రవారం గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్న భూముల రీ సర్వేకు గ్రామం ఎంపికై ందని.. గ్రామంలోని భూములు రీ సర్వే చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భూములకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా, పారదర్శకంగా నవీకరించడంతో పాటు సర్వేనంబర్ల వారీగా హద్దులను గుర్తించి వివాదాలను పరిష్కరిస్తామన్నారు. పూర్తిగా డిజిటల్‌ విధానంలో సర్వే కొనసాగుతుందని.. రైతులు సర్వే అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఎలాంటి సందేహాలున్నా సంబంధిత అఽధికారుల దృష్టికి తీసుకొచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని.. రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సుగుణ, సర్పంచ్‌ రవీందర్‌, ఆర్‌ఐ తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శి ఖాదర్‌బీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement