ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి

Jul 25 2026 12:41 AM | Updated on Jul 25 2026 12:41 AM

పాన్‌గల్‌: వాతావరణ మార్పులకు అనుగుణంగా శాసీ్త్రయ పద్ధతులను అవలంబిస్తూ ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని రాయినిపల్లి, బుసిరెడ్డిపల్లిలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వరికి బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలన్నారు. భూసార పరీక్షల నివేదికల ఆధారంగా ఎరువులు వినియోగించాలని, భూసారాన్ని కాపాడటంతో దిగుబడులు పెరగడంతో పాటు వ్యవసాయం స్థిరమైన అభివృద్ధి దిశగా సాగుతుందని తెలిపారు. భూమి, ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం ఆయా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణల్లో మొక్కలు నాటి నీరు పోశారు. ఆయన వెంట డీఆర్డీఓ ఉమాదేవి, తహసీల్దార్‌ కార్తీక్‌రావు, ఎంపీడీఓ గోవిందరావు, ఆయా గ్రామాల సర్పంచులు హేమాద్రినాయుడు, ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement