మదనాపురం: జిల్లాలోని వైకుంఠధామాల దుస్థితిని వివరిస్తూ గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆఖరి మజిలీకి ఆటంకాలు..’ శీర్షిక కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన మదనాపురం ఎంపీడీఓ ప్రసన్నకుమారి, ఎంపీఓ ఉషనప్ప మండలంలోని అజ్జకొల్లు, కొత్తపల్లి, నిల్విడి తదితర గ్రామాల్లోని వైకుంఠధామాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, వ్యర్థాలను పొక్లెయిన్ సాయంతో తొలగించారు. వైకుంఠధామాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం శుభ్రంగా ఉంచాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.
‘సాక్షి’లో ప్రచురితమైన కథనం


