వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో యూనియన్ బ్యాంక్ వేతన ఖాతాల క్యాంపెయిన్ నిర్వహించగా.. అదనపు కలెక్టర్‌తో పాటు బ్యాంకు డీజీఎం వెంకటేశ్వర్లు, ఎస్‌డీసీ తిరుపతయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ.. జూన్ 25న రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక వేతన ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఎగ్జిక్యూటివ్, ప్రీమియర్, ఎలైట్ ఖాతాలు ఉన్నాయని.. వ్యక్తిగత, ప్రమాద బీమా, టర్మ్ ఇన్సూరెన్‌్స్, ఇతర బీమా సదుపాయాలు, ఆకర్షణీయ రుణ సౌకర్యాలు, ప్రాధాన్య బ్యాంకింగ్ సేవలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం బ్యాంకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వేతన ఖాతాల ప్రత్యేకతలు, బీమా రక్షణ, రుణ సదుపాయాలు, ఇతర ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో ఎల్‌డీఎం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


