‘సర్‌’లో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’లో భాగస్వాములు కావాలి

Jul 24 2026 12:22 AM | Updated on Jul 24 2026 12:22 AM

ఖిల్లాఘనపురం: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. గురువారం మండలంలోని తిర్మలాయపల్లి, గారం, కమాలోద్ధీన్‌పూర్‌, వెంకటాంపల్లి, మానాజీపేటలో పర్యటించి జిల్లా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్‌ బాలీశ్వర్‌రెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, కార్యదర్శి పురేందర్‌రెడ్డితో సర్‌ ప్రక్రియను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో బీఎల్వోలు, బీఎల్‌ఏలతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 100 శాతం పూర్తి చేసిన బీఎల్వోలు, బీఎల్‌ఏలను శాలువాలు, పూలమాలలతో సన్మానించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని.. అర్హలందరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, బీఎల్వోల పాత్ర ఎంతో కీలకమని.. ఇంటింటికి ఫారాలు పంచడమేగాకుండా ఎలా నింపారు.. ఏమైనా తప్పులున్నాయా అనే వివరాలను పరిశీలించి తిరిగి తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లోని చదువుకున్న యువత ముందుకొచ్చి ఎన్యూమరేషన్‌ ఫారాలు నింపే విషయంలో సహకారం అందించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement