వనపర్తిటౌన్: కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండారు శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. టీపీసీసీ, డీసీసీ అధ్యక్షుల పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్‌లో నీట్ ప్రశ్నాపత్రం లీక్, రాహుల్‌గాంధీ అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా మౌనం పాటించడమేమిటని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇంటి ఎదుట ప్రతిపక్ష నేతలు ధర్నా చేస్తే అక్రమంగా అరెస్టులకు పాల్పడ్డారని, రాహుల్‌గాంధీని అక్రమ అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతును నొక్కేయాలనుకుంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని, రాహుల్‌గాంధీపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌పార్టీ విద్యార్థులు, పేదల పక్షాన గళం విప్పుతోందని, పేపర్ లీక్‌లతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న రాహుల్‌గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. అనంతరం రాజీవ్‌చౌక్‌లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. కార్యక్రమంలో పుర వైస్ చైర్మన్ మధుసూదన్, పట్టణ అధ్యక్షుడు కదిరి రాములు, మండల అధ్యక్షుడు రవికిరణ్, గోపాల్‌పేట మండల అధ్యక్షుడు నరహరి, కాంగ్రెస్ నాయకులు లక్కాకుల సతీష్, ఆదిత్య, జానకిరాములు, కార్యకర్తలు పాల్గొన్నారు.


