మా ఊళ్లో ఉన్న పాత శ్మశానంలోనే ఇప్పటికీ అంత్యక్రియలు చేస్తున్నాం. కొత్తగా కట్టిన వైకుంఠధామానికి ఎవరూ వెళ్లడం లేదు. ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో అది వృథాగా మారింది. ఇప్పటికై నా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి.
– విష్ణు, గోపాల్‌పేట
గత ప్రభుత్వ హయంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన వైకుంఠధామాలు నేడు వృథా మారాయి. గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో మృతదేహాలను కాల్చేందుకు ముందుకు రావడం లేదు. మా పొలాల్లో, శ్మశానవాటికల్లో అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. అఽధికారులకు ఈ విషయం ప్రజలకు అవగాహన కల్పించాలి.
– అశోక్‌కుమార్ యాదవ్, మదనాపురం
జిల్లావ్యాప్తంగా ఉన్న వైకుంఠ ధామాల వినియోగం తక్కువగా ఉన్న మాట వాస్తవమే. నీటివసతి, విద్యుత్ కనెక్షన్లు లేని చోట త్వరితగతిన పనులు పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం. గ్రామాల్లో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సర్పంచులు, స్థానిక నాయకులతో మాట్లాడి, ప్రతి గ్రామంలోనూ వైకుంఠధామాల్లోనే అంత్యక్రియలకు ఉపయోగించేలా చూస్తాం. ప్రజాధనం వృథా కాకుండా త్వరలోనే అన్నింటినీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తాం.
– రఘునాఽథ్‌రెడ్డి, డీపీఓ, వనపర్తి
●


