ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి

Jul 22 2026 12:42 AM | Updated on Jul 22 2026 12:42 AM

వనపర్తిటౌన్‌: జిల్లాలో ఓటు చోరీకి తావు లేకుండా సర్‌ ప్రక్రియ పారదర్శకంగా నమోదు చేయించాలని డీసీసీ చైర్మన్‌ శివసేనారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సర్‌ ప్రక్రియ పురోగతిపై పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.. సర్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియ మొదలైన నాటి నుంచి మండలాలు, గ్రామాల వారీగా నివేదికను పరిశీలిస్తూ మందకొడిగా నడుస్తున్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆయా ప్రాంతంలో ఉన్న బీఎల్‌ఏ–2 క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌ జూమ్‌ కాల్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారని, గ్రామాల్లో, మండలాల్లో ఉంటూ సర్‌ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, పట్టణాధ్యక్షుడు కదిరె రాములు, ఇన్‌చార్జీలు కోళ్ల వెంకటేష్‌, శరవంద, విజయలక్ష్మి, బి.కృష్ణ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement