ఓటరు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతం | - | Sakshi
Sakshi News home page

ఓటరు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతం

Jul 22 2026 12:42 AM | Updated on Jul 22 2026 12:42 AM

వనపర్తి రూరల్‌: పారదర్శక ఓటరు జాబితాతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అంజనగిరి, వెంకటాపురం గ్రామాల్లో జరుగుతున్న ఓటరు ఎన్యూమరేషన్‌ విధానాన్ని స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం బీఎల్‌ఓలతో మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు. పార్టీ శ్రేణులు అప్రమత్తమై అర్హులైన ఓటర్లను తది జాబితాలో ఉండేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అంజనగిరి ప్రాథమిక పాఠశాలను సందర్శించి తర గతి గదిలో ఉపాధ్యాయుడై విద్యార్థులకు పాఠాలు బోధించి, విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులంతా ప్రతిరో జు పాఠశాలకు హాజరు కావాలన్నారు. పోషకాహారం తీసుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పృత్వీనాథ్‌ రెడ్డి, శాంతమ్మ మండల అధ్యక్షులు మానిక్యం, సింగిల్‌ విండో అధ్యక్షులు రాఘువర్దన్‌ రెడ్డి, ధర్మనాయక్‌, మాదవరెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి,చిట్యాల రాము పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement