బీఎల్‌ఏలు సమన్వయంలో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఏలు సమన్వయంలో పనిచేయాలి

Jul 16 2026 5:00 AM | Updated on Jul 16 2026 5:00 AM

వనపర్తి రూరల్‌: బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలతో సమన్వయంగా పనిచేస్తూ ఎన్యూమరేషన్‌ కార్యక్రమంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి ఆదేశించారు. బుధవారం మండలంలోని పెద్దగూడెంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌) పక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎల్‌ఏ–2 ఇన్‌చార్జ్‌లతో మాట్లాడి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ఓటరు నమోదు వివరాల సవరణ, ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌లో పూర్తి సహకారం అందించాలని సూచించారు. ప్రతి బీఎల్‌ఏ–2 కనీసం 100 ఎన్యూమరేషన్‌ ఫారాలను డిజిటలైజ్‌ చేయాలని, సర్‌ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పుష్పలత, మాజీ సర్పంచ్‌ కొండయ్య, నాయకులు శివకుమార్‌, భాస్కర్‌రెడ్డి, రొయ్యల రమేష్‌, బుచ్చిబాబు, సురేష్‌, శారదమ్మ, విష్ణువర్ధన్‌రెడ్డి, మల్లేష్‌, గుండాల రాములు, బాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement