అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం, స్థల పురాణంపై విస్తృతంగా ప్రచారం చేస్తామని హైదవ సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం అలంపూర్ క్షేత్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలంపురంగా పిలువబడుతున్న దేవాలయాల ఆసలు పేరు హేమలాపురం అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ హేమలపురం పేరు తెలియపరచాలనే ఆకాంక్షతో పోస్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. జేఏసీ సహాయ కార్యదర్శి రాఘవులు, నర్సింహ, వీరేందర్ గుప్తా, సాయిగౌడు, శ్రవణ్ కుమార్, రమేశ్, రామకృష్ణ పాల్గొన్నారు.


