పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే

Jul 15 2026 1:22 AM | Updated on Jul 15 2026 1:22 AM

వనపర్తి రూరల్‌: నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లితండా, రంగాపురం గ్రామాల్లో 23 మంది ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రంగాపురం గ్రామంలో రైతులకు మంజూరైన ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేయడంతో పాటు గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణను పరిశీలించారు. గ్రామంలో 80 శాతం ఎన్యూమరేషన్‌ పూర్తి చేసినందున బీఎల్వోలను శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన ఓటర్ల పేరు జాబితాలో నమోదు కావడం ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని పేర్కొన్నారు. మిగిలిన నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ అధికారులను కోరా రు. కార్యక్రమంలో పుర చైర్మన్‌ అక్కి శ్రీని వాస్‌గౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ ప్రమోదిని, సర్పంచ్‌ హే మలత, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ రోజారెడ్డి, ఉప సర్పంచ్‌ నందీశ్వర్‌, మండల, పట్టణ అధ్యక్షులు రాంరెడ్డి, దయాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement