● పాలమూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
● రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
వనపర్తి: రానున్న సాధారణ ఎన్నికల నాటికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 20కి చేరుతుంది.. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేపట్టిన పర్యటనలో ప్రజల నుంచి లభించిన ఆదరణను చూస్తే, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేస్తుందనే నమ్మకం వచ్చిందని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో రూ. 359.09 కోట్లతో చేపట్టనున్న 171.96 కి.మీ. హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి,, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక రాజీవ్‌చౌక్‌లో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. పాలమూరు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. 2028 నాటికి అద్దంలాంటి రహదారులను నిర్మిస్తామని అన్నారు. అందులో భాగంగా ఆత్మకూరు రోడ్డు ఆధునికీకరణకు రూ. 6.04 కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లా మాధారం నుంచి మార్చాల రోడ్డు విస్తరణకు రూ. 32.96 కోట్లు, వనపర్తి జిల్లాలోని పెద్దదగడ – వెలగొండ రోడ్డు విస్తరణకు రూ. 45.60కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతినెలా రూ. 4.50లక్షల ప్రజాధనాన్ని వేతనంగా తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ 30 నెలలుగా ఫాంహౌస్‌కు పరిమితమయ్యారని విమర్శించారు. ఓడినా.. గెలిచినా నిత్యం ప్రజల మధ్య ఉండే సీఎం రేవంత్‌రెడ్డి కావాలో.. ఫాంహౌస్‌లో ఉండేవారు కావాలో తేల్చుకోవాలని సూచించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రైతు భరోసా, రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీల అమలును ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తోందన్నారు. ఎమ్మెల్యేలు మేఘా రెడ్డి, జీఎంఆర్ మాట్లాడుతూ..జిల్లా అభివృద్ధికి ఇప్పటికే రూ. 2వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చామని.. మరో రూ.124 కోట్లను మంజూరుచేస్తే, అన్ని ప్రధాన రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, వైస్‌చైర్మన్ మధు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గ ోవర్ధన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


