మొర ఆలకించి.. వినతులు స్వీకరించి | - | Sakshi
Sakshi News home page

మొర ఆలకించి.. వినతులు స్వీకరించి

Jul 14 2026 12:36 AM | Updated on Jul 14 2026 12:36 AM

ప్రజావాణిలో అర్జీల వెల్లువ

సత్వర పరిష్కారానికి కలెక్టర్‌ ఆదేశం

వనపర్తి/వనపర్తి రూరల్‌: సమీకృత కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో పాటు అదనపు కలెక్టర్లు ఎన్‌.ఖీమ్యానాయక్‌, వినోద్‌కుమార్‌ తెలుసుకొని వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్‌ కీలక సూచనలు చేశారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేకపోతే సంబంధిత శాఖకు లేఖ రాసి పంపించాలన్నారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదుదారుడికి తెలియజేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టొద్దని అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 60, ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 9 అర్జీలు అందినట్లు ఆయా కార్యాలయాల అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎన్‌.తిరుపతయ్య, ట్రెయినీ అదనపు కలెక్టర్లు శ్రావ్య, రజనీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement