నమోదు.. నత్తనడక! | - | Sakshi
Sakshi News home page

నమోదు.. నత్తనడక!

Jul 12 2026 12:53 AM | Updated on Jul 12 2026 12:53 AM

అప్పటి కలెక్టర్‌ స్ఫూర్తితో..

న్యూస్‌రీల్‌

పట్టుదలతో చేరాను..

శిక్షణ ఉపయోగపడింది..

సంస్థను ఏర్పాటు చేసి..

జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రీకి 57 వేల మంది రైతులు దూరం

2006లో నేను ఆర్మీలో చేరే ముందు అప్పటి ఉమ్మడి పాలమూరు కలెక్టర్‌ ఉషారాణి ఆర్మీ శిక్షణ కోసం ఉచిత వసతి కల్పించి ప్రోత్సహించారు. చాలామంది మాజీ సైనికులు మమ్మల్ని భారత సైన్యంలోకి పంపించేందుకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, రాత పరీక్షపై అవగాహన కల్పించారు. వారి స్ఫూర్తితో తాము జిల్లాలోని యువతను అగ్నివీర్‌ విభాగంలోకి పంపించేందుకు కృషిచేస్తున్నాం. తొలిసారే అనుకున్న మేరకు అగ్నివీరులను తయారు చేశాం. రెండో బ్యాచ్‌ను సిద్ధం చేసి ట్రైనింగ్‌ ఇస్తున్నాం. సాధ్యమైనంత కాలం ఈ ఉచిత ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ కొనసాగిస్తాం.

– మహేష్‌, మాజీ సైనికుడు,

జై జవాన్‌, జై కిసాన్‌ ఫ్రీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ నిర్వాహకులు, వనపర్తి

9 రోజులు.. రూ.99.04 కోట్లు జమ : ఎమ్మెల్యే

వనపర్తి రూరల్‌: నియోజకవర్గంలోని 92,115 రైతుల ఖాతాల్లో కేవలం 9 రోజుల్లో రూ.99.04 కోట్ల రైతుభరోసా నిధులు జమ చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు కుటుంబాల్లో ఆర్థిక భరోసా నింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70,40,286 మంది రైతుల ఖాతాల్లో రూ.8,759.60 కోట్లు జమ చేయడం ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జిల్లాలో 1,83,011 మంది రైతులకు రూ.212.57 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నామని.. గత బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అమలు చేసిన అనేక వ్యవసాయ రాయితీలను గత ప్రభుత్వం నిలిపివేసిందని గుర్తుచేశారు. ప్రతి రైతు కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభు త్వం అండగా నిలుస్తుందని వివరించారు.

మంత్రాలయానికి

ప్రత్యేక బస్సు

కొత్తకోట: ఈ నెల 14న అమావాస్య సందర్భంగా మంత్రాలయం, పంచముఖి ఆంజనేయస్వామి దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా డీలక్స్‌ బస్సు నడుపుతున్నట్లు వనపర్తి డిపో మేనేజర్‌ దేవేందర్‌గౌడ్‌ శనివారం తెలిపారు. 14వ తేదీ మంగళవారం వనపర్తి బస్టాండ్‌ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి పంచముఖి ఆంజనేయస్వామి దర్శనానంతరం మంత్రాలయం చేరుకుంటుందని.. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు తిరిగి బయలుదేరుతుందని వివరించారు. టికెట్‌ ధర ఒక్కరికి రూ.600గా నిర్ణయించామని.. ఆసక్తిగల ప్రయాణికులు వనపర్తి బస్టాండ్‌ రిజర్వేష న్‌ కౌంటర్‌ నంబర్‌ 73828 29151, 73828 29379 బుక్‌ చేసుకోవచ్చని సూచించారు.

శనేశ్వరుడికి అభిషేకాలు

కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు తిలతైలాభిషేకాలు జరిపించినట్లు అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. పూజారి మాట్లాడుతూ ఈ మాసంలో స్వామివారిని కొలిచిన అత్యధిక సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని భక్తులకు ఇస్తారని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తి మేరకు పూజించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ గోపాల్‌రావు, సర్పంచ్‌ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆర్మీ సెలెక్షన్‌ కోసం ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ వ్యాయామం చేస్తున్న యువకులు

మా గ్రామం ఆర్మీ జవాన్లకు పుట్టినిల్లు లాంటిది. మండలంలోనే అతిచిన్నదైన మా గ్రామంలో సుమారు 38 మంది యువకులు భారత సైన్యంలో పని చేస్తున్నారు. అలాంటి దేశభక్తులు ఉన్న గ్రామంలో పుట్టిన నేను కూడా భారత సైన్యంలో చేరి దేశభక్తిని చాటుకోవాలనే పట్టుదలతో అగ్నివీర్‌లో స్థానం దక్కించుకున్నాను. – మొహిలా అలీ,

కొన్నూరు గ్రామం, మదనాపురం

వనపర్తి: సాయుధ దళాల్లో యువశక్తిని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నిపథ్‌ పేరుతో సైనిక నియామక పథకం రూపొందించింది. ఈ విభాగంలో చేరిన వారిలో 75 శాతం మంది సైనికులను నాలుగేళ్లకు ఇంటికి పంపిస్తారు. అందుకు తగిన ఆర్థిక భరోసా కల్పిస్తూ.. మిగతా 25 శాతం మంది సైనికులకు అర్హత పరీక్షల ఆధారంగా పదోన్నతలు కల్పించి దేశ రక్షణకు ఉపయోగించుకుంటారు. వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ సైనికులు మొదట్లో వేర్వేరుగా.. కొద్దిరోజుల నుంచి కలిసి యువతకు శిక్షణ ఇస్తూ అగ్నివీరులుగా తీర్చిదిద్దుతున్నారు. దేశరక్షణ వ్యవస్థలో అత్యంత ఆధునికతతో నిర్వహించే అగ్నివీర్‌ (అగ్నిపథ్‌)లోకి పంపించేందుకు ఫిజికల్‌, రాత పరీక్షలపై ఉచిత శిక్షణ ఇస్తూ.. యువతను ప్రోత్సహిస్తుండటం.. అందుకు దేశభక్తి గల యువకులు ఆసక్తి చూపిస్తుండటంతో అనుకున్న మేరకు ఫలితాలనిచ్చాయి. ఈ క్రమంలోనే 2025– 26లో జారీ చేసిన నోటిఫికేషన్‌లో జిల్లాకు చెందిన మాజీ సైనికులు పి.మహేష్‌, గబ్బర్‌సింగ్‌ ట్రైనింగ్‌ ఇచ్చిన 16 మందితో పాటు పెద్దమందడి ముందరితండాకు చెందిన మరో యువకుడు ఎంపికయ్యారు. నాలుగేళ్ల సర్వీస్‌ తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చే వీరు ఒక్కొక్కరు వందమంది యువకులను దేశ రక్షణ కోసం తయారు చేసేలా ప్రస్తుత మాజీ సైనికులు శిక్షణ ఇస్తూ చైతన్యం చేస్తున్నారు.

గతంలో పలుమార్లు సైన్యంలోకి వెళ్లాలని నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకుని వెళ్లాను. కానీ, ఫలితం దక్కలేదు. మాజీ సైనికులు ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని వారితో ట్రైనింగ్‌ తీసుకున్న తర్వాత అగ్నివీర్‌లో చోటుదక్కింది. ఆర్మీలో ఫిజికల్‌ ట్రైనర్‌గా పనిచేసిన వారు కావడంతో వారిచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది.

– రాఘవేంద్ర, ద్వారకానగర్‌, మదనాపురం

సుమారు 18 ఏళ్లు సైన్యంలో పనిచేసిన మాజీ సైనికుడు పి.మహేష్‌ తనవంతుగా దేశరక్షణ కోసం యువతను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ‘జై జవాన్‌.. జై కిసాన్‌.. ఫ్రీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌’ సెంటర్‌ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి.. కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో యువతకు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు అనుమతి పొందారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రధాన భవనం వెనక భాగంలో యువతకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈయన ఆర్మీలో ఏఐపీటీగా నాలుగేళ్ల అనుభవం ఉండటంతో ఒక సైనికుడికి కావాల్సిన ఫిట్‌నెస్‌ యువతలో కలిగేలా శిక్షణ ఇస్తూ.. అగ్నివీర్‌ విభాగానికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. గత బ్యాచ్‌లో తన శిష్యులు ఏడుగురు ఉద్యోగం సాధించగా.. మరో మాజీ సైనికుడు గబ్బర్‌సింగ్‌ వద్ద శిక్షణ తీసుకున్న మరో తొమ్మిది మందిని ఇప్పటికే అగ్నివీర్‌కు పంపించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి మరో 15 మందికి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌పై శిక్షణ ఇస్తున్నారు.

గుర్తింపు లేకుంటే సంక్షేమ పథకాలపై ప్రభావం

అవగాహన లేదంటున్న అన్నదాతలు

నిరంతర ప్రక్రియ అంటున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement