కొత్తకోట రూరల్: విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాసీ్త్రయ దక్పథం అలవర్చుకొని సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలని ప్రముఖ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. శనివారం మండలంలోని అమడబాకుల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో చోటుచేసుకుంటున్న ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత, శాసీ్త్రయ పరిశోధనల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అలాగే సేంద్రియ ఆహార పదార్థాలు, వాటిలోని ఔషధ గుణాలు, ఆరోగ్య పరిరక్షణలో వాటి విశిష్టతపై అవగాహన కల్పించారు. భవిష్యత్‌లో సైనన్స్, టెక్నాలజీ, వైద్య, పరిశోధనా రంగాల్లో ఉన్న అవకాశాలను తెలియజేశారు. 21వ శతాబ్ద నైపుణ్యాలు, శాసీ్త్రయ ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఓ చందన, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


