ఫార్మర్ రిజిస్ట్రీపై సంబంధిత అధికారులు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన పథకం మేలు గురించి రైతులను చైతన్యపర్చాల్సిన అవసరం ఉంది. చాలామందికి తెలువకపోవడంతో నమోదు చేసుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
– లక్ష్మణ్, రైతు, అమడబాకుల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పంటల బీమా, వివిధ రకాల పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించేందుకు సంబంధిత అధికారులు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. ఫార్మర్ రిజిస్ట్రీపై నేటికీ రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో నమోదు చేసుకోవడం లేదు. – బకెట రాజు, రైతు, కొత్తకోట
ఫార్మర్ రిజిస్ట్రీ నిరంతరం కొనసాగే ప్రక్రియ. పలు కారణాలతో కాస్త ఆలస్యంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం వద్ద రైతులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండాలనే లక్ష్యంతో యూనిక్ కోడ్ నంబర్ కేటాయింపు ప్రక్రియను ప్రారంభించింది. భవిష్యత్‌లో ప్రభుత్వం అమలు చేసే రైతు సంక్షేమ పథకాల అనుసంధానం చేసే అవకాశం ఉండవచ్చు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకుంటే మంచిది.
– షేక్ మున్నా, ఇన్‌చార్జ్ ఏడీఏ, కొత్తకోట


