అమరచింతలో కమలం.. కొత్తకోటలో గులాబీ... | - | Sakshi
Sakshi News home page

అమరచింతలో కమలం.. కొత్తకోటలో గులాబీ...

Jul 11 2026 12:30 AM | Updated on Jul 11 2026 12:30 AM

అమరచింతలో కమలం.. కొత్తకోటలో గులాబీ...

అమరచింత/కొత్తకోట రూరల్‌: కొత్తకోట చేనేత సహకార సంఘంలో బీఆర్‌ఎస్‌.. అమరచింతలో బీజేపీ ప్యానల్‌ అభ్యర్థులు విజయం సాధించారు. కొత్తకోటలో 9 డైరెక్టర్‌ స్థానాలకుగాను 8 బీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలువగా.. అమరచింతలో మొత్తం తొమ్మిది స్థానాలను బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. విజేతలకు రిటర్నింగ్‌ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అమరచింతలో తిరుమల రఘురాం, మేర్వ అనిల్‌, మ్యాడం కృష్ణయ్య, పారుపల్లి గోవర్ధన్‌, ఎంకంపల్లి శ్రీను, వగ్గు వెంకటేష్‌, తిరుమల రఘు, మహంకాళి సులోచన, నాగమణి గెలుపొందారు. అదేవిధంగా కొత్తకోట చేనేత సహకార సంఘంలో సాక నర్సింహ, దిడ్డి చంద్రశేఖర్‌, జన్ను లలిత, పగడాకులు నర్సమ్మ, సాక ఆంజనేయులు, సాంబరి వెంకటస్వామి, పగడాకుల రాములు, జన్ను సత్యనారాయణ, మహంకాళి వెంకటయ్య విజయం సాధించగా.. విజేతలను ఆయా పార్టీల నాయకులు పూలమాలలు వేసి సన్మానించి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement