వనపర్తి: పోలీసు డ్యూటీ మీట్‌లు వృత్తి నైపుణ్యాలకు పదును పెట్టే ఉత్తమ వేదికలని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన డ్యూటీ మీట్–2026లో పతకాలు సాధించిన వారికి గురువారం ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతిభ కనబర్చారని ఎస్పీ ప్రశంసించారు. మొత్తం 11 పతకాలు సాధించగా.. అందులో 5 బంగారు, 5 రజత, 1 కాంస్య ఉన్నట్లు వెల్లడించారు. జిల్లా వాసులు రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌కు అర్హత సాధించినట్లు వివరించారు. ఇలాంటి పోటీలు పోలీసు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేసే నైపుణ్యం, క్లిష్ట పరిస్థితులను వేగంగా విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రతి సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతాయని తెలిపారు. ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, షీటీం, భరోసా ఎస్సై అంజద్ తదితరులు పాల్గొన్నారు.


