ఆస్తి, కొళాయి పన్ను వసూళ్లకు పుర కమిషనర్లు వార్డు అధికారులు, సిబ్బందితో వార్డుల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగినా 50 శాతానికి కూడా చేరుకోలేదు. సెలవు రోజుల్లో సైతం బకాయిల వసూళ్లకు ఇల్లిల్లూ తిరిగినా ఆశించిన మేర ఫలితం రాలేదనే చెప్పవచ్చు.
సిబ్బంది కొరత..
మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడం కూడా పన్ను వసూళ్లలో వెనకబాటుకు కారణంగా చెప్పవచ్చు. పుర అధికారులతో పాటు పారిశుద్ధ్య కార్మికులను సైతం పన్ను వసూళ్లకు తీసుకెళ్లినా సరైన స్పందన రాలేక పోయింది. దీనికితోడు పుర ఎన్నికలు రావడం, పనిభారం అధికం అవడం కూడా కారణమంటున్నారు.


