ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు

Apr 7 2026 7:19 AM | Updated on Apr 7 2026 7:19 AM

వనపర్తిటౌన్‌: హిందూ వ్యతిరేక విధానాలు, కమ్యూనిస్టుల విదేశీ వాదానికి వ్యతిరేకంగా ఏర్పడింది బీజేపీ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని నాగవరంలో కొత్తగా ఏర్పాటుచేసిన పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. రెండు ఎంపీ స్థానాలతో ప్రారంభమైన బీజేపీకి నేడు 17 కోట్ల మంది కార్యకర్తల బలం, దేశంలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని చెప్పారు. 23 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉందని, త్వరలో రాష్ట్రంలోనూ పార్టీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీతోనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తునందని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రామన్నగారి వెంకటేశ్వరరెడ్డి, కేతూరి బుడ్డ న్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, వారణాసి కల్పన, ఉ పాధ్యక్షుడు గొర్ల బాబు రావు, కుమారస్వామి, జిల్లా కార్యదర్శి కాటమోని కృష్ణగౌడ్‌, కౌన్సిలర్‌ విజయసాగర్‌, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, రాము, కొమ్ము శ్రీనివాసులు, ప్రవీణ్‌, ద్వారపోగు నారాయణ, రాజశేఖర్‌గౌడ్‌, అరవింద్‌, నవీన్‌, చిన్నరాయుడు, కోన శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement