గోపాల్‌పేట: ఏదుల, రేవల్లిలో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాలను త్వరలో ప్రారంభించి ప్రజలకు సేవలు అందిస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఉమ్మడి గోపాల్‌పేట మండలంలో పర్యటించారు. మొదట ఏదుల తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్ త్వరగా సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిసేవలు ఒకే దగ్గర అందించేలా చూడాలని సూచించారు. ఆయన వెంట స్థానిక అధికారులు ఉన్నారు.


