వనపర్తి రూరల్: కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని నాచహళ్లి శివారులో ఉన్న మెస్సర్స్ రిలిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సుమారు రూ.6.06 కోట్ల రైస్‌మిల్లు ఆస్తులు సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో జప్తు చేశామని తహసీల్దార్ రమేష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్ తదితర అధికారులతో కలిసి మిల్లును తనిఖీ చేశామన్నారు. 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి డిఫాల్ట్ ధాన్యం 10,310.091 ఎంటీఎస్ బకాయిలు రూ.31 కోట్లు చెల్లించాల్సి ఉందని కాలయాపన చేస్తుండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం మిల్లును సందర్శించి పంచనామా నిర్వహించి 8 వాహనాలు, బాయిల్డ్ రైస్ 1.5 ఏసీకే, మిల్లు, మిగతా చరాస్తులను జప్తు చేసినట్లు వివరించారు.
నేడు మంత్రి
వాకిటి శ్రీహరి రాక
ఆత్మకూర్: రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం మండలంలో పర్యటించనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలోని ఈద్గా వద్దకు చేరుకొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతారని, 11 గంటలకు ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారని పేర్కొన్నారు. పార్టీ సర్పంచ్‌లు, పుర కౌన్సిలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.


