
చేనేత వస్త్రాలకు
పెరుగుతున్న ఆదరణ
అమరచింత: చేనేత వస్త్రాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని నాబార్డ్ సీజీఎం ఉదయ భాస్కర్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని అమృత్ మహాల్‌లో అమరచింత చేనేత వస్త్ర తయారీ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాంచ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం ఏర్పాటై అంచలంచెలుగా ఎదుగుతూ ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా దేశ విదేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోందని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో సైతం తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ప్రత్యేక షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చేనేత కార్మికులు కంపెనీలో భాగస్వాములుగా ఉంటూ వచ్చిన లాభాలను సమానంగా పంచుకొని వ్యాపారాలు, ఉత్పత్తులను పెంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో టెస్కో ఎండీ వైకే రావు, ఫౌండేషన్ ఫర్ ఎంఎస్‌ఎంఈ అడ్వైజర్ శ్రవణ్‌కుమార్‌శర్మ, అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం కంపెనీ సీఈఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.