
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
వనపర్తిటౌన్: ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థులకు బోధనతో పాటు చట్టాలపై అవగాహన కల్పించాలని.. తద్వారా విద్యార్థులు ఎలాంటి తప్పులు చేయకుండా ఉన్నతంగా రాణించేందుకు ఆస్కారం ఉంటుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ప్రజ్వల సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై పోక్సో, మోటార్ వెహికల్ యాక్ట్, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ తదితర చట్టాల గురించి వివరించారు. ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలకు టోల్ ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి, ఏఎంఓ మహానంది, ప్రజ్వల సంస్థ కో–ఆర్డినేటర్ అంబర్‌సింగ్, ఇన్‌చార్జ్ కృష్ణవేణి, రిసోర్స్ పర్సన్ శ్రీలత, పారా లీగల్ వలంటీర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.